పయనించే సూర్యుడు జూన్ 15,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని మండల కేంద్రంలోని రాయల వీరయ్య భవనంలో ఆదివారం సీపీఎం మండల కమిటీ సమావేశం తోటకూరి వెంకట నరసయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మధిర డివిజన్ కార్యదర్శి మడపల్లి గోపాల్ రావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వత్సవాయి జానకిరాములు, దేశబోయిన ఉపేందర్ పాల్గొని సంస్థాగత బలోపేతం, ప్రజా ఉద్యమాల నిర్వహణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మధిర డివిజన్ కమిటీ సభ్యులు ఆలస్యం రవి, మడపల్లి కిరణ్‌బాబు, మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు కాటబత్తిని వీరబాబు, లింగం కోటి, వాకా సీతారామిరెడ్డి, గడ్డం రమణ, కోటేశ్వరరావు, నన్నక కృష్ణమూర్తి, జల్లేపల్లి పుల్లయ్య, రౌతు అప్పారావు, బల్లి వీరయ్యతో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ కార్యక్రమాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.