ప్రజ్ఞాపూర్ ‘జె.ఆర్ ఫ్యామిలీ ధాబా’పై టాస్క్‌ఫోర్స్ మరియు గజ్వేల్ పోలీసుల మెరుపు దాడి: 55 లీటర్ల మద్యం స్వాధీనం

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జూన్ 16 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్:ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ని ప్రజ్ఞాపూర్ డబ్బాలో నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గజ్వేల్ టౌన్ పోలీసులు సంయుక్తంగా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ గ్రామంలోని ‘జె.ఆర్ ధాబా’ పై మెరుపు దాడి నిర్వహించారు. దాభలో అక్రమంగా నిల్వ ఉన్న మొత్తం 55.7 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ నిర్వాహణకు కారణమైన నిందితుడు దాబా ఓనర్ అర్రవెల్లి రవి (45) పై , ఈ దాడిలో ధాబాలో అక్రమంగా మద్యం సేవిస్తున్న 17 మందిపై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ టౌన్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలిపారు. మీ ప్రాంతంలో ఎలాంటి అక్రమ లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే, వెంటనే డైల్ 100 కు లేదా టాస్క్‌ఫోర్స్ నంబర్ 8712667447 కు సమాచారం అందించాల్సిందిగా కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.