ప్రతిభను ప్రశంసించిన సర్పంచ్ ప్రభాకర్,ఉప సర్పంచ్ కె.వి ..

★ పంచాయతీ తరుపున స్ఫూర్తి,లిఖిత,ధన్యశ్రీ లకు ఘన సన్మానం. ★ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు, అధికారులు..

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 7, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ అకాడమిక్ ఫలితాలలో ప్రథమ స్థానంలో నిలిచిన పలువురు విద్యార్థులను గుమ్మా స్ఫూర్తి, బెజవాడ లిఖిత నాగేశ్వరి, తాళ్ల ధన్యశ్రీ లను ఆ గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్,ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ) శాలువాలతో ఘనంగా సన్మానించి, సత్కరించారు. అనంతరం మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో రాణించాలని. గ్రామానికి, మండలానికి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని. ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ముందుగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిజాను గ్రామ పంచాయతీ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ దామోదర్ ప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది, పాల్గొన్నారు.