పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 6 జగ్గయ్యపేట మండలం, చిలకల్లు గ్రామానికి చెందిన చెందిన గంధం కొండా, రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె కుమారి గంధం చందన శ్రీజ బి.ఏ. (ఆనర్స్) పొలిటికల్ సైన్స్–2023 బ్యాచ్‌లో విశిష్ట ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయ గోల్డ్ మెడల్తో పాటు భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మెమోరియల్ ఎండౌమెంట్ గోల్డ్ మెడల్ అందుకోవడం, అలాగే అదే గ్రామానికి చెందిన పసుపులేటి నరసింహారావు, నాగమణి దంపతుల కుమార్తె కుమారి శరణ్య ఇంటర్ బైపీసీలో 989 మార్కులు సాధించి, ఏపీ ఈఏపీసెట్‌లో 687వ ర్యాంకు సాధించడం పట్ల ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను సతీమణి సామినేని విమలభాను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.