ప్రతి మాదిగ పల్లెలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలి: ఎమ్మార్పీఎస్ పిలుపు

కార్యక్రమంలో ఎంఎస్ పి జిల్లా అధ్యక్షులు కరిగల్ల దశరథం ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కర్నే పరమేష్ మాదిగ

పయనించే సూర్యుడు జూన్ 5 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేపట్టనున్న “గోటు టు విలేజ్” 40 రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా తాడూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కర్నె పరమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి ఆడెపు నాగార్జున మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ విద్యార్థులు చదువులో రాణించేలా ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని, చదువు మధ్యలో నిలిపివేసిన విద్యార్థులను తిరిగి విద్యాభ్యాసం వైపు ప్రోత్సహించాలని సూచించారు. విద్య ద్వారానే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే నెల జూలై 7న ఎమ్మార్పీఎస్ 33వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి మాదిగ పల్లెలో ఎంఆర్‌పీఎస్, అనుబంధ సంఘాల గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గోటు టు విలేజ్ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో విస్తృతంగా నిర్వహించి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్‌పీ పార్టీ జిల్లా అధ్యక్షులు కరిగేళ్ల దశరథం మాదిగ, ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు గుడిగానిపల్లి రాజు మాదిగ, తాలూకా ఇంచార్జి గూట విజయ్ మాదిగ, ఎంఆర్‌పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కర్నె పరమేష్ మాదిగ, నాగర్‌కర్నూల్ మండల అధ్యక్షుడు భాస్కర్ మాదిగ, బరిగల వెంకటేష్, బరిగల రవి, బరిగల పరమేష్, జుట్టు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.