పయనించే సూర్యుడు న్యూస్: నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యి 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం' పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ, రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు ఆదేశాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావలని బిజెపి సీనియర్ నాయకులు గొల్ల కోటి వెంకటరెడ్డి బీజేపీ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ . శుక్రవారం కాట్రేనుకోన టౌన్ లో బీజేపీ నేతలు మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా ముమ్మిడివరం మార్కెటింగ్ వైస్ చైర్మన్ (బిజెపి సీనియర్ నాయకులు ) మాట్లాడుతూ ప్రకృతే పరమాత్మగా భావించే మన సంస్కృతిలో పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని గుర్తుచేశారు. గ్లోబల్ వార్మింగ్, అనావృష్టి వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో మొక్కలు నాటడం ఎంతో ఆవశ్యకమని స్పష్టం చేశారు. అమ్మ పేరిట ఒక మొక్క నాటాలి అని ప్రధాని మోదీ అద్భుతమైన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి (అమ్మ) పేరిట కనీసం ఒక మొక్కనైనా నాటాలి. మొక్కను నాటడమే కాకుండా, అది వృక్షంగా ఎదిగేంత వరకు దాన్ని పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలి. ముఖ్యంగా మన జిల్లాలోని రైతు సోదరులు తమ పొలాల గట్ల వెంబడి, ఖాళీ స్థలాలలో నీడను, పండ్లను ఇచ్చే మొక్కలను నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషించాలి. "మనకు జన్మనిచ్చిన అమ్మ రుణం తీర్చుకుంటూ.. మనకు సర్వస్వాన్ని ఇస్తున్న భూమాతను కాపాడుకోవడానికి ఈ పర్యావరణ దినోత్సవం నాడు 'అమ్మ పేరుతో ఒక మొక్క' నాటి పచ్చని కోనసీమను మరింత సుందరంగా తీర్చిదిద్దుకుందాం" అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ మట్ట సూరిబాబు తదితరులు ఉన్నారు