ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన లో విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:

ముళ్లపూడి రేణుక

పయనించే సూర్యుడు జూన్ 5 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమ పాలన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యశాల గురువారం అమలాపురంలోని హోటల్ సత్యనారాయణ విలాస్‌లో ఘనంగా నిర్వహించబడింది. జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యశాలకు రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం సామూహిక వందేమాతరంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా రాష్ట్ర అధికార పతినిధి నల్ల పవన్ కుమార్ కర్రి చిట్టిబాబు పాలూరి సత్యానందం ఇళ్ల సత్యనారాయణ ఆర్.వి. నాయుడు , జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం, మహిళా సాధికారత, యువత ఉపాధి, రైతు సంక్షేమం వంటి రంగాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొచ్చే ఉజ్వల యోజన, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా వంటి పథకాలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కాలంలో సంక్షేమ పథకాలు మధ్యవర్తుల చేతుల్లో చిక్కుకుపోయేవని, కానీ మోదీ ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా పారదర్శక పాలన అందిస్తూ ప్రజల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేసే వ్యవస్థను విజయవంతంగా అమలు చేసిందని ఆమె తెలిపారు. భారత్ నేడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో ప్రధానమంత్రి మోదీ దూరదృష్టి నాయకత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రపంచ వేదికపై భారతదేశ గౌరవాన్ని పెంచడంతో పాటు, దేశ భద్రత, సరిహద్దుల రక్షణ, స్వావలంబన లక్ష్యాల సాధనలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందని కొనియాడారు. ప్రతి బీజేపీ కార్యకర్త కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలితాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, ప్రతి లబ్ధిదారుని కలుసుకుని ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. దేశాన్ని 2047 నాటికి “వికసిత భారత్”గా తీర్చిదిద్దాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్ప సాధనలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం జిల్లా నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యాక్రమంలో జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు, మోర్చా అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.