పయనించు మే 28 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పురపాలక సంఘానికి చేర్చి ఉన్న ప్రధాన కాలువ త్రవ్వకం గాని,చెత్తను తొలగించి శుభ్రం చేయడం గాని చేయకపోతే ఈ కలుషిత నీరు క్రింద ఉన్న గ్రామాల ప్రజలకు ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశమున్నది. దీని పర్యవేక్షణలో ఇరిగేషన్ మరియు మున్సిపాలిటీ సంయుక్తంగా పని చేయాలి.ఇప్పుడు చల్లపల్లి ప్రధాన కాలువ త్రవ్వుతున్న విధంగానే నడిపూడి వరకు పనులు కొనసాగించాలని కోరుతున్నాము. అదేగాక ఇటీవల నల్లవంతెన నుండి స్మశానంవరకు కాలువ పక్కన వేసిన మట్టి గుట్టలు మరల కాలువలోనికి కొట్టుకునిపోయే అవకాశమున్నది. ఒకవేళ కాలువ త్రవ్వినా చేసిన పని నిరూపయోగం అయ్యే అవకాశం ఉన్నది. కావున వెంటనే ఈ సమస్యలపై అధికారులు,పాలకులు స్పందించవలసినదిగా కోరుతున్నాము *వంటెద్దు వెంకన్నాయుడు వైస్సార్సీపీ కార్యదర్శి అమలాపురం