ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం

ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రామ పెద్దలు, కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారీ

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 6 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం నరసింహపురం గ్రామం లో ఈ రోజు నరసింహపురంలో గ్రామ పటేల్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగింది, అలాగే మొక్కలు కూడా నాటడం జరిగింది, ఒక మొక్క కొన్ని వేల కోట్ల లక్షల మందికి ఆక్సీజన్ వంటివి అందిస్తాయి,మొక్కలు వల్ల మంచి ఆరోగ్యం, గాలి, ఈరోజు అందరం కలిసి ఒక సంకల్పంగా చేద్దాం భూమి మన ఇల్లు.. ప్రకృతి మన జీవనాధారం. ప్రకృతిని రక్షించుకోవడం మన బాధ్యత సహజ వనరులను కాపాడుకోవడం మన బాధ్యత గాలి నీరు నేలను కలుస్తాం కాకుండా అందరం కృషి చేద్దాం పచ్చదనం పెంపు ఎందిన వనరులు పొదుపు కాలుష్యం నివారణకు సహకరిద్దాం ప్రతి ఒక్కరూ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కను నాటుదాం ఈరోజు మా కూనవరం గ్రామంలోని మొక్కను నాటి పర్యావరణ రక్షించడానికి ముందడుగుగా వేయడం జరిగింది పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఒక మొక్కను నాటాలి స్కూలు కాలేజీ హాస్పిటల్ బస్ స్టాప్ ఆవరణంలో మొక్కలు నాటి ఆక్సిజన్ లెవెల్స్ పెంచాల్సిందిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం లో కుటూరు సెక్షన్ ఆఫీసర్ తిమ్మా సాయి, బురదగూడెం ఆఫీసర్ దుర్గ భవాని, గ్రామ పట్టేల్ ముచ్చిక బాలకృష్ణ, కొమరం బీమ్ యూత్ అధ్యక్షులు పొడియం రమేష్,ఉపా అధ్యక్షులు ముచ్చిక వినోద్, యూత్ సలహా దారులు కాక సీతారామయ్య,సోయం మహేష్,మడివి శ్యామ్,ముచ్చిక శరత్,తదితరులు పాల్గొన్నారు.