ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలకు ప్రతి గర్భిణీ నీ ప్రోత్సహించాలి .

★ హెల్ప్ డెస్క్ సేవల రికార్డుల ఆకస్మిక తనిఖీ. ★ మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ పి. లక్ష్మణ్ నాయక్..

పయనించే సూర్యుడు మే 28 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా నాగర్కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ సేవలను బుధవారం నాడు మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ పి లక్ష్మణ్ నాయక్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న ప్రతి గర్భిణికి హెల్ప్ డెస్క్ సేవలు వినియోగపడాలని, ప్రతి గర్భిణీని తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే సుఖ ప్రసవం పొందే విధంగా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు. గర్భిణీ స్త్రీలకు అందే సేవలను రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రసవానికి వచ్చుటకు 108 లేదా 102 సేవలు తప్పనిసరిగా వినియోగించాలని, ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత ఇంటికి చేరుటకు 102 వాహనాన్ని తప్పనిసరిగా వినియోగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో రాజగోపాల చారి, ఓరుగంటి శ్రీనివాసులు,నరసింహ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్కర్ జ్యోతి, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి.యాదగిరి,సుజాత,102 వాహన జిల్లా మేనేజర్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.