
పయనించే సూర్యుడు న్యూస్,నవంబర్ 02(ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ):పట్టణంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్,ఇకో-క్లబ్ ఆధ్వర్యంలో బ్రిక్స్ వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డి.సునీత అధ్యక్షత నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బ్రిక్స్ కూటమి ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక,సామాజిక,సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారుభారత్,బ్రేజిల్ రష్యా,చైనా,దక్షిణాఫ్రికా వంటి దేశాల మధ్య పరస్పర సహకారం,ఐక్యత,అభివృద్ధి ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు.బ్రిక్స్ వారోత్సవాల ద్వారా విద్యార్థుల్లో అంతర్జాతీయ అవగాహన,ప్రపంచ పౌరసత్వ భావన, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను పెంపొందించడం లక్ష్యమని పేర్కొన్నారు.ఈ వారోత్సవాలు నవంబర్ 1వ తేది నుండి నవంబర్ 7వ తేదీ వరకు జరుగుతాయన్నారు.ఈ కార్యక్రమంలో ప్రయాగ మూర్తి ప్రగడ,ఎస్కే మదీనా,వి రామ రావు,వెంకటేశ్వరరావు,ప్రవీణ్ కుమార్,వివిఎస్ ప్రసాద్,శ్రీ లక్ష్మి,బంగార్రాజు,అధ్యాపకేత సిబ్బంది,విద్యార్దిని,విద్యార్దులు పాల్గొన్నారు.
