ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు పి.జి.లో ర్యాంకుల పంట

పయనించే సూర్యుడు-31-05-2026-రాజంపేట న్యూస్ : పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ప్రవేశాలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి గాను జరిగిన ప్రవేశ పరీక్షలో రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులకు ర్యాంకుల పంట పండింది. కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. బోటనీ మేజర్ గా డిగ్రీ పూర్తి చేసిన డి.శ్రావణి రాష్ట్ర స్థాయిలో ప్రథమ శ్రేణి సాధించగా, జువాలజీ మేజర్ గా డిగ్రీ పూర్తి చేసిన షేక్ ఆయేషా కౌసర్ 10వ ర్యాంకును సాధించినట్లు ప్రిన్సిపల్ పురుషోత్తం తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.