పయనించే సూర్యుడు జులై 3 రాజేష్ ) దొమ్మాట, జూలై 2: ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని చాటుతూ దొమ్మాట గ్రామ ఉపసర్పంచ్ అక్కమొల్ల రేవతి శేఖర్, వార్డు సభ్యులు గురువుగారి యాదగిరి మరియు భాషమైన రాజు తమ పిల్లలను (ఎంపీపీస్ ) దొమ్మాట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం చేర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. వెంకటేశం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం ఉంచి తమ పిల్లలను గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించిన ప్రజాప్రతినిధులకు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామ ప్రజాప్రతినిధులు పాఠశాల అభివృద్ధికి నిరంతరం సహకరించాలని ప్రధానోపాధ్యాయులు కోరగా, విద్యాభివృద్ధి కోసం తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ ప్రజాప్రతినిధులు స్వయంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించేలా ఆదర్శంగా నిలిచారని పలువురు అభిప్రాయపడ్డారు