ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య…

బడిబాట కార్యక్రమంలో ఇటిక్యాల సర్పంచ్ నీరటి శ్రీనివాస్, జిల్లా ఆత్మ చైర్మెన్ కాటిపెల్లి గంగారెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 12 మామిడిపెల్లి లక్ష్మణ్ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఇటిక్యాల గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్, జగిత్యాల జిల్లా ఆత్మ ఛైర్మెన్ కాటిపెల్లి గంగారెడ్డి లు అన్నారు. ఇటిక్యాల ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థుల చేర్పును పెంచేందుకు ఉపాధ్యాయ బృందంతో కలిసి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటిక్యాల గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులందరు తమ బాధ్యత గా తీసుకోవాలని అన్నారు. గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదిన వారే ఉన్నత పదవులు, ఉన్నత శిఖరాలు అదిరోహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, గాజెంగి రాజేశం, హన్మంతరావు, ఎద్దండి రమేష్ రెడ్డి, స్వర్ణలత, రాజం తదితరులు పాల్గొన్నారు.