ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులకు ఉచితంగా ‘సిరి సంపద మాల్ట్’ పంపిణీ చేయనున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్​పుంగనూరు:

పయనించే సూర్యుడు మేజ ర్ న్యూస్ జూలై 08.07.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినుల శారీరక దృఢత్వాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించడమే లక్ష్యంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత 'సిరి సంపద మాల్ట్' పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ పి. అయూబ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ​నేను బాగుంటే చాలు అని స్వార్థాన్ని పక్కనపెట్టి… అందరూ బాగుండాలి అందులో నేనుండాలి" lఅనే ఉన్నతమైన ఆశయంతో, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

.

​'సిరి సంపద మాల్ట్' l ప్రత్యేకతలు:


​40 కి పైగా ధాన్యాలు, చిరుధాన్యాల పోషక విలువలతో సమృద్ధిగా తయారు చేయబడిన ఈ హెల్త్ మిక్స్, ఎదిగే బాలికలకు అవసరమైన సంపూర్ణ ఆహారాన్ని అందిస్తుంది. ​ ఇందులో శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ మరియు సహజ పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ​ ​రోగనిరోధక శక్తిని విశేషంగా పెంపొందిస్తుంది. ​విద్యార్థినులలో శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. ​ మెదడు శక్తిని, ఏకాగ్రతను (ధ్యాసను) మెరుగుపరుస్తుంది. ​జీర్ణక్రియను సాఫీగా మార్చి, శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ​ఎముకల బలానికి, శారీరక పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది. ​కళాశాల విద్యార్థినుల సంపూర్ణ ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న ఈ ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, బాలికలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ ప్రతినిధులు కోరారు. ​భవదీయుడు, డాక్టర్ పి. అయూబ్ ఖాన్ ఛైర్మన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్