పయనించే సూర్యుడు జూన్ 4 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో “పొల్యూషన్ ఫ్రీ అవేర్నెస్” కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్ తెలిపారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు కళాశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి మహేష్, ఎన్జిసి జిల్లా సమన్వయకర్త రాజశేఖర్ రావు హాజరై పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ వల్ల కలిగే ప్రయోజనాలు, కాలుష్యం వల్ల ఎదురయ్యే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు సహజసిద్ధంగా తయారైన టూత్ బ్రష్లు, బట్ట సంచులను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం అధ్యాపకులు విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అంజయ్య, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.