ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం. కాలనీవాసుల ఆందోళన

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి జూలై 5 యాడికి మండల కేంద్రంలోని అంకాలమ్మ వీధి పీర్ల చావిడి పక్కన గల ఉన్న విద్యుత్ సిమెంట్ స్తంభం పూర్తిగా పుచ్చిపోయి ప్రమాదకరంగా మారింది. స్తంభం కింది భాగం పూర్తిగా ఊడిపోయి, ఒక్క గాలికి పడిపోయే స్థితిలో ఉండటంతో స్థానికులు భయం భయంగా తిరుగుతున్నారు. స్తంభానికి ప్రక్కనే ఇళ్లు, దుకాణాలు, పాఠశాలకు వెళ్లే పిల్లలు రోజూ రాకపోకలు సాగిస్తుంటారు పెద్ద ప్రమాదం జరిగే లోపు విద్యుత్ స్తంభాన్ని మార్చాలని కాలనీవాసులు విద్యుత్ అధికారులను కోరుతున్నారు