పయనించే సూర్యుడు, జులై 5, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండల కేంద్రంలోని బీడీ కాలనీ శివారులో ఉన్న గోధుమ కుంటలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బచ్చన్నపేటకు చెందిన ఏలూరి బాలరాం (60) శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గోధుమ కుంట వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. మృతుడికి గతంలో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని మృతుడి భార్య భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బచ్చన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ శోభన్ తెలిపారు.ఈ సందర్భంగా వర్షాకాలంలో ప్రజలు నీటి కుంటలు, వాగులు, చెరువులు మరియు ఇతర నీటి వనరుల సమీపంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బచ్చన్నపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.