ప్రమాద భరితంగా విద్యుత్ సరఫరా తీగలు.

చెయ్యి చాచితే విద్యుత్ ప్రమాదం బారిన పడాల్సిందే

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 7 గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వర పురం లో గూడూరు చెరువుకు అనుకుని ఉన్న విద్యుత్ తీగలు ప్రమాద భరితంగా ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఎక్కువగా గిరిజనులు నివాసం ఉంటున్నారు.వేసవి సెలవులు కావడంతో చిన్నారులు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఆడుకుంటుంటారని స్థానికులు తెలిపారు.విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వైర్లు చేతికి అందకుండా ,ఎత్తులో ఏర్పాటు చెయ్యాలని కొరుతున్నారు.రానున్న వర్షాకాలంలో విద్యుత్ వైర్ల మూలంగా ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది