ప్రముఖ యూట్యూబ్ ఆర్టిస్ట్ తెలంగాణ ఉద్యమ కళాకారుడు మారం ప్రవీణ్ కుమార్ కు అనారోగ్యం. .

పయనించే సూర్యుడు జూలై 8 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ : సీనియర్ డాన్స్ మాస్టర్ ప్రముఖ యూట్యూబ్ ఆర్టిస్ట్ తెలంగాణ ఉద్యమ కళాకారుడు ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ సంస్థ ఫౌండర్ మెంబర్ మరియు మెగాస్టార్ చిరంజీవి అభిమాని మారం ప్రవీణ్ కుమార్ పప్పీ అనారోగ్యం పడిన పడటంతో కుటుంబ సభ్యు లు ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేర్పించగా విషయం తెలుసుకొని తేదీ 6-7-2026 సోమవారం సాయంత్రం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారుల విభాగం ఉపాధ్యక్షులు సీనియర్ యూట్యూబ్ కళాకారులు కనపర్తి హనుమాన్ కార్తికేయ హాస్పిటల్ లో ప్రవీణ్ కుమార్ ని వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుని ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని భగవంతుని వేడుకున్నారు. అనంతరం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి మాట్లాడుతూ వైద్యులు తాత్కాలిక చికిత్స అందించి హైదరాబాద్ లోని కార్పోరేట్ ఆసుపత్రిలో చేర్పించాలని వైద్యానికి దాదాపు 35 లక్షల నుండి 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలపడం జరిగింది దీంతో ఆర్థిక పరిస్థితులు బాగాలేక మారం ప్రవీణ్ ఇంటికి రావడం జరిగింది ప్రస్తుతం అతను అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గతంలో ఇతను కళా రంగంలో రాణిస్తూ సామాజిక సేవలో పాలుపంచుకుంటూ ఎంతోమందికి ఆపద సమయంలో అండగా నిలిచారు కానీ ఇతనికి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి రావడం బాధాకరమైన విషయం కావున ఆయన నరాల సర్జరీ మరియు లివర్ ప్లాంటేషన్ కోసం అత్యవసర మైనది సుమారు 50 లక్షలతో కూడిన వైద్యం అవసరము అని వైద్యులు తెలిపారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు తున్నారు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు మనము మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది కావున మారం ప్రవీణ్ కుమార్ తిరిగి కోలుకోవాలని వైద్య ఖర్చులకు తగిన ఆర్థిక తోడ్పాటు అందించాల్సిన సింది గా కళాకారుల పక్షాన కోరుతూ ఈరోజు 07-06-2026మంగళవారం ఉదయం హైదరాబాద్ కార్పోరేట్ హాస్పిటల్ కు వెళ్తున్నారని తెలియజేస్తూ మీ యొక్క ఆర్థిక సహాయం కోరుతూ మీకు అందించే చిన్ని సహాయం ఒక నిండు ప్రాణాన్ని రక్షిస్తుంది దయతో విరాళాలు అందించేవారు గూగుల్ పే,ఫోన్ పే నెంబర్ 8125358565 కు మన వంతు సహాయం అందిద్దాం కళాకారులందరూ దయతో మీకు తెలిసిన కళా సంస్థలకు కళా పోషకులకు కళాకారులకు కళాభిమానులకు తెలియజేయుటకు కృషి చేస్తారని ఆశిస్తున్నాము.