ప్రీతి కేసుకి అండగా నిలబడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు వేయడం అక్రమం రేఖా గౌడ్

పవన్ కళ్యాణ్ పై పార్వతి దేవి విమర్శలు చేసే ముందు గతం గుర్తు చేసుకోవాలి శ్రీశైలం బోర్డు మెంబర్ రేఖా గౌడ్

పయనించే సూర్యుడు న్యూస్ జులై 08,2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ సుగాలి ప్రీతి విషయంలో తమకు పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని అని చెప్పి ప్రీతి తల్లి పార్వతి దేవి పవన్ కళ్యాణ్ ద్వారా లబ్ది పొంది ఇప్పుడు ఆయన పైనే కేసు పెట్టడం ఎంత వారకు సమంజసమని జనసేన పార్టీ ఎమ్మిగనూరు ఇంచార్జి,శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రేఖగౌడ్ విమర్శించారు. సుగాలి ప్రీతి కేసులో ప్రీతి తల్లికి ఎ రాజకీయ పార్టీ అండగా లేని సమయంలో పవన్ కళ్యాణ్ అండగా నిలిచి పోరాటం చేశారని, పవన్ కళ్యాణ్ పోరాటం కారణంగా ప్రీతి కుటుంబానికి పరిహారం లభించిందని, పవన్ కళ్యాణ్ ద్వారా లబ్ధి పొంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ప్రతి విషయంలో తమకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడని, చెప్పడం మంచి పద్ధతి కాదని ఒకరి లబ్దికోసం పవన్ కళ్యాణ్ విమర్శించడం సరికాదని పార్వతి దేవి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే ముందు గతంలో తన కుటుంబానికి అండగా నిలబడిన వ్యక్తి ఎవరో ఆత్మ పరిశీలన చేసుకుని, ఆలోచన చేయాలని లేని పక్షాన ప్రీతి కేసును మరోసారి సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతామని రేఖ గౌడ్ స్పష్టం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కరుణాకర్, రామ్మోహన్, సుధాకర్, జీవన్, మహబూబ్, మాలిక్, వీర మహిళలు సుజాత, పుష్ప మొదలగు వాళ్లందరూ పాల్గొన్నారు.