ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం

పయనించే సూర్యుడు, కోరుట్ల మే 31 కోరుట్ల పట్టణంలోని ప్రాథమిక పాఠశాల ఎస్ ఆర్ ఎస్ పి గడి,ప్రాథమిక పాఠశాల పైడిమడుగు, ప్రాథమిక పాఠశాల నాగులపేట, ప్రాథమికోన్నత పాఠశాల ధర్మారం 4 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఈ విద్యాసంవత్సరం నుండి ప్రి ప్రైమరీ తరగతులు అందుబాటులోకి వస్తున్నట్లు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి గంగుల నరేశం తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేశ్యం తో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గత విద్యా సంవత్సరం 3 ఈ విద్యార్థి సంవత్సరం 4 ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నామన్నారు. ఆ పాఠశాలల్లో విద్యార్థులకు ఆకర్షణీయమైన తరగతి గదులు,ఆట వస్తువులు, బొమ్మలు, ఫర్నిచర్ వంటి పలు సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది.ఆయా పాఠశాలలకు విద్యను భోధించేందుకు ఉపాధ్యాయులను, ఆయా లను నియమించనున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎక్కువ సంఖ్యలో తమ పిల్లలను ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించాలని మండల విద్యాధికారి కోరారు.