ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరణ ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికి 14 రోజులు రిమాండ్

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 03,2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మండల పరిధిలోని బి అగ్రహారం గ్రామాములో ఓకే కమ్యూనిటీకి చెందిన, మాల మోహన్, మాలపార్వతి ఇద్దరు గత సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్న విషయం ఇరువురి రెండు కుటుంబాల తల్లిదండ్రులకు తెలుపగ, పెద్దలు సమక్షంలో, కలిసి మాల పార్వతికి పెళ్లి వయసు రాలేదని 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేస్తామని ఇరువురి కుటుంబాలకు పెద్దమనుషులు తీర్మానం చేశారు.అయితే మాల మోహన్ గత కొన్ని రోజులుగా పార్వతితో అంటి ముట్టనట్టు ప్రవర్తిస్తూ,నేను నిన్ను పెళ్లి చేసుకోను వేరే అమ్మాయిని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో, పార్వతి కుటుంబసభ్యులు అందరు కలిసి మోహన్ ఇంటికి వెళ్లి ఇన్ని రోజులు ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకో అని మొహంచాస్తున్నావని నిలదీయగా, మాల మోహన్, నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఏమైనా చేసుకో, నీవు చచ్చిన పెళ్లి చేసుకునేది లేదని, అవమానకరంగా మాట్లాడడంతో, తీవ్రమణస్థాపానికి గురైన మాలపార్వతి 28.05.2026 వ తేదీన తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది విషయం తెలుసుకున్న గోనెగండ్ల సీఐ ఏ చంద్రబాబు, క్రైమ్ నెంబర్ 51/2026 గా కేసు నమోదు చేయగా, దర్యాప్తులో భాగంగా 02వ తేదీ 12:30 గంటలకు అమ్మాయి ఆత్మహత్యకు కారకుడైన, ముద్దాయి మాల మోహన్, 20 సంవత్సరాలు తండ్రి మల్లికార్జున అగ్రహారం గ్రామం ఊరి బయట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పోలీస్ సిబ్బందితో సీఐ చంద్రబాబు అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు, తెలిపారు. ముద్దాయికి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు.