పయనించే సూర్యుడు జూలై 05 ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి ఆదోని పట్టణంలో నడుస్తున్న పలు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు ప్రయాణికుల రవాణాతో పాటు భారీగా గూడ్స్, పార్సిళ్లను కూడా తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని డివైఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేసింది ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు మోహన్, కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షులు సతీష్, మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని అనేక ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల వాహనాల కంటే గూడ్స్ వాహనాలుగా మారిపోయాయని ఆరోపించారు. ప్రయాణికులతో పాటు పెద్ద మొత్తంలో పార్సిళ్లు సరుకులు తరలించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు ప్రత్యేకించి ఎలాంటి తనిఖీలు లేకుండా ప్రమాదకరమైన వస్తువులు కూడా రవాణా అయ్యే అవకాశం ఉందని, దీనివల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని సంబంధిత అధికారులు చూస్తూ కూడా చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు ఆర్టీవో శాఖ వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని,హెచ్చరించారు.లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జమీర్ పాల్గొన్నారు..