ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు ఇతర సామగ్రి అమ్మరాదు

పయనించే సూర్యుడు న్యూస్ మే 21 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. విద్యను వ్యాపారంగా చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయని పాఠశాలల్లోనే పుస్తకాలు ఇతర సామగ్రి అమ్మటంపై పలాస ఎంఈఓ సిహెచ్ శ్రీనివాసరావు మండిపడ్డారు. రాష్ట్ర విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు మే 15న ప్రైవేట్ బడ్జెట్ కార్పోరేట్ పాఠశాలల కరస్పాండెంట్ లతో తాను సమావేశాన్ని నిర్వహించానని తెలిపారు. ఈ విషయంపై ఎంఈఓ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థులకు అందవేస్తున్న పుస్తకాల అట్టలను మార్చి వారి పాఠశాలల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులకు అధిక రేట్లకు అమ్ముతున్నారని, ఈ విషయంపై ప్రైవేటు పాఠశాలల పై కఠిన చర్యలు చేపడుతామని ఆయన అన్నారు పుస్తకాలతో పాటు షూలు, నోట్ పుస్తకాలు మరియు ఇతర సామాగ్రి అధికరేట్లలో విద్యార్థుల తల్లిదండ్రులకు విక్రయించడంతో వారికి తలకు మించిన భారం వేస్తున్నారని, ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి తనకు ఫిర్యాదులు అందాయని ఆయన అన్నారు. ఇలా విక్రయించిన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం నిబంధనలు తప్పక పాటించాలన్నారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై కేసులను నమోదు, లేదంటే ఆ పాఠశాల రిఖగ్నైజేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. తల్లితండ్రులు ధైర్యంగా ఈ విషయంపై మాకు ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు విద్యార్థులపై ఏ విషయంపైనైనా ఒత్తిడి తెచ్చిన, వెంటనే పాఠశాలలపై రైడింగ్ చేసి తగు చర్యలను చేపడతామన్నారు. ప్రైవేట్ పాఠశాలలలో విద్యార్థి పేరును తొలగించమని తల్లితండ్రులు అభ్యర్థిస్తే, పాఠశాల యాజమాన్యం నిరాకరిస్తే ఆ విషయం తల్లితండ్రులు తమకు డిక్లరేషన్ ఇచ్చినట్లయితే వెంటనే ఆ పాఠశాల నుండి వారి పేర్లను తొలగించి, విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని అన్నారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తామంతా కట్టుబడి పని చేస్తున్నామని ఆయన వివరించారు.