ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి వ్యతిరేకంగాఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన

పయనించే సూర్యుడు, జూన్ 14 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎం కుమార్ ) మియాపూర్ లోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలను బలవంతంగా అమ్మడం, అధిక ఫీజులు వసూలు చేయడం, ఫీజు ఆలస్యంగా కట్టినందుకు పెనాల్టీ పేరుతో తల్లిదండ్రులను దోచుకోవడానికి వ్యతిరేకంగా ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మియాపూర్ హెచ్ ఎంటి స్వర్ణపురి లోని ఎంఎన్ఆర్ స్కూల్ ముందు భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఫీజు ఆలస్యంగా కట్టినందుకు లేట్ ఫీజులు, పెనాల్టీల పేరుతో లక్షల రూపాయలు తల్లిదండ్రుల నుండి వసూ లు చేస్తున్న స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు వసూలు చేసిన లేట్ ఫీజు లను వెంటనే తల్లిదండ్రులకు తిరిగి ఇప్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి, దుర్గాప్రసాద్, గణేష్, యువజన కాంగ్రెస్ నా యకులు మన్నె నరేంద్ర ముదిరాజ్, టిఆర్ఎస్వి సెరీలింగంపల్లి నాయకులు రా జు యమలవలస ఎన్ టీవీఎస్,నాయకులు పవన్, జగదీష్,ఇతర విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రు లు, పలు ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు విద్యను వ్యాపా రంగా మార్చి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతు న్నాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇదే అంశంపై 26/02/2026న డి ఈ ఓకి ఫిర్యాదు చేయగా,డీఈవో స్థానిక శేర్లింగంపల్లి ఎంఈఓకి విచా రణచేసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఎంఈఓ కి,స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి కాపీ మాకు కూడా పంపించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరిగినట్టు ఆధా రాలు లేవు. వెంటనే ఎంఈఓ విచారణ చేపట్టి సం బంధిత ఎంఎన్ఆర్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.