ఫరూక్ నగర్ ఎంపీడీవోగా శ్రీకాంత్

చేవెళ్ల ఎంపీడీవోగా బదిలీపై బన్సీలాల్

పయనించే సూర్యుడు జూన్ 02 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలానికి కొత్తగా కె శ్రీకాంత్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నియమితులయ్యారు. ఈయన తలకొండపల్లి మండలం నుండి బదిలీపై వచ్చారు. సోమవారం శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది వారికి సన్మానం చేసి పుష్పగుచ్చంతో ఆహ్వానం పలికారు. అదేవిధంగా ఇంతకుముందు మండల పరిషత్ ఫరూక్ నగర్ లో పనిచేసిన ఎం. బన్సీలాల్ ఎంపీడీవో చేవెళ్ళకు బదిలీపై వెళ్లడం జరిగింది. రెండు సంవత్సరాల పాటు ఎంపీడీవోగా బన్సీలాల్ సేవలు అందించారు