ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్,సర్టిఫికేషన్కిట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన జోనల్ కమిషనర్నారాయణ అమిత్ ఐఏఎస్

పయనించే సూర్యుడు, మే 23 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ నారాయన్ అమిత్ ఐఏఎస్ అదనపు కమిషనర్ (యు బి డి ) సుభద్రదేవి సీరిలింగంపల్లి జోన్ ఫుడ్ సేఫ్టీ అధికా రుల సమన్వయంతో, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం, 2006 నిబంధనల ప్రకారం వీధి ఆహార విక్రేతల కోసం ఎఫ్ ఎస్ టి సి (ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ కిట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆహార భద్రత, పరిశుభ్రత సురక్షిత ఆహార నిర్వహణ పద్ధతులపై వీధి ఆహార విక్రేతల్లో అవ గాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో మొత్తం 110 మంది విక్రేతలు పా ల్గొని ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ కోర్సు ను విజయవంతంగా పూర్తి చేశారు. పాల్గొన్న వారికి హైజీన్ కిట్లు పంపిణీ చేయబడినవి. సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నెస్లే ఇండియా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించారు.