పయనించే సూర్యుడు, మే 30 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు జరిగే అనర్ధాలను తెలియజేస్తూఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మద్రించిన గోడ పత్రిక (స్టిక్కర్)ను ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఎం. లక్ష్మారెడ్డి (సర్కిల్ ఇన్ స్పెక్టర్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ గచ్చిబౌలి) వారి కార్యాలయంలో గోడప త్రికను ఆవిష్కరించి తదనంతరం మాట్లా డుతూ "ప్రపంచ ఆరోగ్యసంస్థ వారు మే నెల 31వ తారీఖునాడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని 1988వ సంవత్సరము నుండి ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తు న్నారు"అని అన్నారు.ఈ సంవత్సరపు నినాదం 'నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కో వాలని పిలుపునివ్వడం"అని అన్నా రు."ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పొగాకు పొగాకు ఉత్పత్తుల వలన ప్రజల ఆరోగ్యానికి, సమాజానికి, పర్యావరణానికి కలిగే హాని గురించి అవగాహన పెంచడ మే"అని అన్నారు. "పొగాకు పొగాకు ఉత్పత్తులను సేవించ డం వలన ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవ త్సరం 80 లక్షలకుపైగా మరణాలు సంభవి స్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలియజేస్తున్నాయి" అని అన్నారు.ముఖ్యంగా యువత ధూమపానానికి బాగా అకర్షితులవుతు న్నారు. పొగ త్రాగడం వలన ఊపిరి తిత్తుల, గుండె సంబంధిత జబ్బులు, ఊపిరితిత్తుల, ఉదరకోశ క్యాన్సర్ తో పాటు క్షయ, దంతక్షయం, అల్సర్, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఏర్పడుతున్నా యి" అని అన్నారు. "పొగాకులో ఉండే నికోటిన్ అనే రసాయనం వలన రక్తపో టు, పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అజీర్తి వంటి అనేక అనారోగ్య సమస్య లకు దారి తీస్తుందని వైద్యులు తమ నివేదికల ద్వారా హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో స్మోకింగ్ కారణంగా యేటా 13.5 పైచిలుకు లక్షల మంది మృత్యువాత పడుతున్నారని నివేదికలు తెలియజే స్తున్నాయి. పొగాకు పొగాకు ఉత్పత్తు లైన సిగరెట్లు, సిగారు, గుట్కా, పాన్ పరాగ్, హుక్కా, బీడీ, నశ్యము మొద లైన వాటిని అనేక రూపాలలో వినియో గిస్తున్నారు. నమలడం, పీల్చటం లాంటి మొదలైన పద్ధతులలో వీటిని ఉపయో గించే వారితో పాటు ప్రక్కన ఉండి పొగ పీల్చే వారు కూడా పైన ఉదహరించివ రోగాల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నా రు. దీనినే 'సెకండ్ హ్యాండ్ స్మోకింగ్' అంటారు. ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ప్రభావం పిల్లలపై అధి కంగా ఉంటుంది. ఒక సిగరెట్ కనుక తాగితే మనిషి యొ క్క జీవితకాలంలో 20 నిమిషాల ఆయు ష్షు తగ్గినట్టే.పొగాకు పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన ఆరోగ్యం క్షీణించడం, ఆర్థి కంగా నష్టపోవడమే కాకుండా చివర కు ప్రాణనష్టం కూడా జరుగు తూ ఉంది. ఆరోగ్యమే మహా భాగ్య ము కావున ఈ పొగాకు పొ గాకు ఉత్పత్తుల వినియోగా నికి దూరంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం మన చేతు లలో ఉంటుంది.పొగాకు పొ గాకు ఉత్పత్తుల వినియోగం ఎగుమ తులలో చైనా, ఇండియా మొదటి రెండు స్థానా లలో ఉండగా బ్రెజిల్, యు.ఎస్.ఎ, ఇండోనే షియా తరువాతి స్థానాలలో ఉన్నాయి. భారతదేశంలో గుజరాత్, ఆంధ్రప్ర దేశ్,ఉత్తర ప్రదేశ్, తెలంగాణ కర్నాటక తదితర రాష్ట్రా లలో పొగాకును ఎక్కు వగా పండిస్తు న్నారు.ప్రతి ఒక్కరూ పొగా కు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి యోగా, ధ్యానం వంటి మంచి అలవాట్లతో పాటు పౌష్టికాహారం తీసుకుని మంచి జీవనం తో ఆరోగ్యాన్ని సంరక్షించు కోవాలి" అని అన్నారు. "పొగాకు పొగాకు ఉత్పత్తుల ను సేవిం చేవారు వాటిని మానాలంటే పొగ త్రాగా లని అనిపించిన పుడు ఆరోగ్యకరమైన చిరు తిండ్లను తినడం ద్వారా నారింజ, బత్తాయి, ద్రాక్షా వంటి పండ్లను తినడం లేదా పండ్ల రసాలను త్రాగడం,చూయిం గ్ గమ్ నమలడం, చాక్లెట్లు తినడం, పుదీనా ఆకులు లేదా పుదీనా నీరు త్రాగడం,పచ్చి కూరగా యలు తినడం, మంచినీరు ఎక్కువగా త్రాగడం, దాల్చిన చక్క, యాలకులు, లవంగాలను నమ లడం, గోరువెచ్చని పాలు త్రాగడం, నిమ్మకాయ నీరు త్రాగ డం ద్వారా ఈ దురలవాట్లను మాన వచ్చు" అని తెలిపారు."దీనికి సంకల్ప బలం ఉంటే ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండ వచ్చు, కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి" అని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎం శ్రీహ రిబాబు, కొత్తపల్లి కోటేశ్వరరావు, అమ్మయ్య చౌదరి, జీవి రావు, సత్య నారాయణ, వాణీ సాంబశివరావు, పాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.