బక్రీద్ పండుగ సందర్భంగా తగిన వసతులు కల్పించాలని వినతిపత్రం.

( పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ) 22 మే రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా మెట్టుపల్లి పట్టణంలోని ఈద్గాహ్‌లో నమాజీలకు తగిన వసతులు కల్పించాలని వినతి పత్రం అందించిన నాయకులు ఇస్లాంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన బక్రీద్ 28నాడు జరుపుకోనున్నాము. ఈ సందర్భంగా మెట్టుపల్లి పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది ముస్లింలు ఈద్గాహ్‌లో సామూహిక ఈద్-ఉల్-అజహా నమాజ్‌లో పాల్గొంటారు. పండుగను భక్తి శ్రద్ధలతో, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకోవడానికి క్రింది వసతులు వెంటనే కల్పించాలని వినయపూర్వకంగా కోరుతున్నాము. ఈద్గాహ్ ప్రాంగణం, పరిశుభ్రత, ప్రవేశ మార్గాలు, పరిసరాలను పండుగకు 2 రోజుల ముందు పూర్తిగా శుభ్రం చేయించి, చెత్త, పిచ్చి మొక్కలు తొలగించాలనీ నీటి సౌకర్యం నమాజీల కోసం తాగునీటి ట్యాంకర్లు మరియు వుజూ కోసం తగినన్ని నీటి ఏర్పాట్లు చేయాలి. ఎలాంటి విద్యుత్ అంతరాయము లేకుండా ఏర్పాటు చేయాలి. అలాగే ఈద్గాహ్ వద్ద ప్రతిష్ట బందోబస్తు శాంతిభద్రతల పరిరక్షణకు తగిన పోలీస్ బందోబస్తు మరియు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాటు చేయాలని తాత్కాలిక సౌకర్యాలు ఎండ,వర్షం నుండి రక్షణ కోసం తాత్కాలిక పందిరి, బారికేడ్లు ఏర్పాటు చేయాలి. పై వసతులు వల్ల ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పండుగను జరుపుకోగలరాని . మీరు తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి, పనులు పూర్తి చేయించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ (సదర్) ఆఖ్తర్ జానీ,( ఏ ఐ ఎం ఐ ఎం ) మెట్ పల్లీ టౌన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అఖిల్, కౌన్సిలర్ అజీమ్,నదీమ్, మల్లాపూర్ సత్తార్, మహబూబ్
అజీమ్ ముల్సబ్ తదితరులు పాల్గొన్నారు.