పయనించే సూర్యుడు మే29ఆదోనిడివిజన్ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో బక్రీద్ సందర్భంగా మద్రాసాలు మరియు పలు ప్రాంతాల్లో పశువులను వధిస్తున్న ప్రాంతాలను సందర్శించి ఎక్కడా కూడా ఆవులను చిన్న లేగ దూడలను అనారోగ్యకరమైన వాటిని పశువులను వధించ రాదని పలు ప్రాంతాల నందు సందర్శించి అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేయడం జరిగినది మరియు అపరిశుభ్రతకు చోటు ఇవ్వకూడదని శుభ్రత పాటించవలెనని అందరికీ వధించిన వ్యర్ధాలను రోడ్లమీద గాని కాలువలో కానీ పారవేయకుండా మునిసిపాలిటీ నుండి బ్యాగులను అందజేసి వారికి తగు సూచనలను అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సందీప్ కుమార్ మరియు వెటర్నిటీ బృందము అయిన డాక్టర్లైన డాక్టర్ ఎం ప్రదీప్, వంశీకృష్ణ , క్రాంతి కుమార్ పాల్గొనడం మరియు వారితో పాటు సానిటరీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర మున్సిపాలిటీ సిబ్బంది శంకర్ నరసింహులు సుధా మేస్త్రిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు