బచ్చన్నపేటలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు, జూలై 9, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. ​కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి మసూద్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి 77 వ జయంతిని వైద్య సేవలు, విద్యావకాశాలకు, రైతు సంక్షేమానికి ఆయన మార్గదర్శి. ఆరోగ్యశ్రీ తో పేదలకు ఉచిత వైద్యం ఫీజు రియంబర్స్మెంట్తో విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించిన వ్యక్తి వైయస్సార్ అని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ​వైఎస్సార్ ఆశయ సాధన కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఎండి మసూద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగారావు, మండల కాంగ్రెస్ నాయకులు, నల్లగోని బాలకిషన్ గౌడ్, ఈదులకంటి వెంకట్ రెడ్డి,వివిధ గ్రామాల అధ్యక్షులు, యువజన, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.