బచ్చన్నపేట లో ఘనంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

★ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.. సర్పంచ్ అల్వాల నర్సింగరావు ★ సమస్యలు ఉంటే తెలుపండి పరిష్కరిస్తాం పలు శాఖల అధికారులు.

పయనించే సూర్యుడు జూన్ 7 బచ్చన్నపేట మండల ప్రతినిధి నీల పవన్ తెలంగాణ రాష్ట్ర సర్కార్ సమగ్ర ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోని అభివృద్ధిలో రాణించాలని బచ్చన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అల్వాల నర్సింగరావు అన్నారు. శనివారం స్థానిక బచ్చన్నపేటమేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామ సభలో మండలంలో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ సీజన్ ఆసన్నమవుతుందని, సాగు భూములను సిద్ధం చేసుకోవాలని, ఫామాయిల్ మరియు వివిధ రకాల సాగు చేసుకునే దిశగా రైతులు ద్రుష్టి సరించాలని మండల వ్యవసాయ అధికారి శరత్ చంద్ర తెలిపారు. వానాకాలం వచ్చిందని, పరిసరాల పరిశుభ్రత భాద్యతగా గుర్తించి, ఆరోగ్య భద్రత పై ప్రత్యేక శ్రర్ద తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ వైద్యులు సృజన అన్నారు. మండలంలో ప్రజల విజ్ఞప్తి మేరకు కరెంటు డిపార్ట్మెంట్ ఏఇ రాజకుమార్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో కరంట్ స్థంబాల కింద చెట్లు పెట్టకూడదని మరియు వ్యవసాయ బావుల వద్ద గాని ఇంటి వద్ద గాని తప్పనిసరిగా పెట్టుకోవాలని ఇనుప తీగలతో దండాలు కట్టకూడదని కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉందని ఎలాంటి ప్రమాదం జరిగిన కరెంటు డిపార్ట్మెంట్ అధికారులకు తెలియజేయాలని తెలిపారు మరియు నర్మెట సీఐ అబ్బాయ పాల్గొని . వాహనాలు రోడ్ల పై ప్రయాణించే ప్రతీ ఒక్కరు లైసెన్సులు కలిగి ఉండాలని, హెల్మెంట్స్ విధిగా ధరించాలని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతి ఏరియా కు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని అసాంఘిక కార్యక్రమాల పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకుని పోలీసు వారికి తెలియజేయాలని వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు . పశు వైద్యులు, రెవెన్యూ అధికారులు, మండల ప్రజా పరిషత్ అధికారులు సమస్యలు ఉంటే తెలుపండని, వెంటనే పరిష్కరిస్తామని పలు సూచనలు చేశారు. ఈ గ్రామ సభకు ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు, ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.