బడా భీంగల్ రోడ్డు మరియు వంతెనను మరమ్మత్తు చేయాలని బిజెపి పోరుబాట

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5 నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం గురువారం రోజు బిజెపి భీంగల్ పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో గత పోయిన సంవత్సరం వానాకాలం భారీ వర్షాలతో భీంగల్ నుండి బడా భీంగల్ వెళ్లే. ఆర్ అండ్ బి. రోడ్డు మొత్తం కొట్టుకపోవడం జరిగింది, ఈరోజు ఆ రోడ్డు మార్గాన్ని వంతెనను పరిశీలించడం జరిగింది, ఈ వర్షాలు పడే లోపు ఆ రోడ్డును మరమ్మత్తు చేయాలని వంతెనను మరమ్మత్తు చేయాలని భీంగల్ తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టేట్ కౌన్సిల్ మెంబెర్ యోగేశ్వర నర్సయ్య మరియు పట్టణ అధ్యక్షులు కనికరం మధు మాట్లాడుతూ గత సంవత్సరం బారి వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు మరియు వంతెన మరమత్తు కు నామ మాత్రం రిపేర్లు చేస్తూ మొరం పోసీ డబ్బులు లేపుకున్నారు కానీ రోడ్ల మరమ్మత్తులు మాత్రం చేయలేదు, అను నిత్యం రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నా కాంగ్రేస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు, భీంగల్ మండల అధ్యక్షులు ఆరే రవీందర్ మాట్లాడుతూ పోయిన వానకాలం జరిగిన నష్టం మామూలు కాదు రోడ్లు పూర్తిగా ధ్వంసమై బడా భీంగల్ చెంగల్ సికింద్రాబాద్ గోనుగోప్పల గ్రామాల వారితోపాటు అనేక గ్రామాల ప్రజలు సుదూరం నుండి తిరిగి వచ్చేవారు పంట నష్టం విపరీతంగా జరిగింది అలాగే వంతెన కూడా పూర్తిగా చెడిపోయి రాకపోకలు రెండు మాసాలు లేకుండా పోయినాయి భీంగల్ నుండి ఆర్మూరుకు అతిపెద్ద రోడ్డు మార్గం అయినటువంటి ఈ రోడ్డు చెడిపోవడం ద్వారా చాలా గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు 10 నెలలు గడుస్తున్న కనీసం ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అలాగే బాల్కొండ నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద పదవులు అనుభవిస్తున్న నాయకులు భీంగల్ కు రావాలంటే ఇదే రోడ్డు మార్గం రావాలా మీ కండ్లకు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు, ప్రభుత్వంలోని పెద్దలు గ్రూపులు చేసుకుని మరి వాగు నుండి ఇసుక తోడేసుకుని అమ్మేసుకొని వాటాలేసుకుని పంచుకుంటున్నారే కానీ ఆ వాగు పైన ఉన్న బ్రిడ్జి పరిస్థితిని మాత్రం పది నెలలు గడిచిన బిజెపి నాయకులమైన మేము ఎన్నిసార్లు ప్రశ్నించిన పట్టించుకున్న పాపాన పోవడం లేదు దీనికి తగిన మూల్యం మీరు చెల్లించక తప్పదు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు అని తెలిపారు,ఈ వానకాలం వచ్చె లోపు పూర్తి స్థాయిలో మరమత్తులు చేయకపోతే బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాదర్,పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు నీలం గంగాదర్,మండల ఉపాధ్యక్షులు ఈర్ల మహేందర్,పార్థ సారథి,జిల్లా ఓ బి సి మోర్చా కార్యదర్శి చిట్టి గౌడ్,కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు తక్కూరి అంజయ్య,కొట్టాల మోహన్ మరియు పట్టణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవీన్,బీ,జే,వై,ఎమ్,నాయకులు కొట్టాల అశోక్,మండల కార్యదర్శి రజినీకాంత్,సీనియర్ నాయకులు కాట్లే లింగం,ప్రశాంత్, హరిప్రసాద్,ఉప్పల నవీన్,యోగిని శ్రీనివాస్,పుండరీకం,భూత్ అధ్యక్షులు కార్యకర్తలు శక్తి కేంద్ర ఇన్చార్జిలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..