బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన చిన్నపీరు తండా సర్పంచ్ మునిందర్

పయనించే సూర్యుడు మే 26 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ చిన్నపీరు తండాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “బడిబాట” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మునిందర్ గ్రామంలోని ప్రతి చిన్నారిని ప్రభుత్వ పాఠశాల లో చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు భావన, పార్వతి ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తండా పెద్దలు, మహిళలు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని “పిల్లలందరినీ బడికి పంపుదాం” అంటూ నినాదాలు చేశారు.