పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 2 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున గ్రామంలో "బడి పిలుస్తోంది"చైతన్య విద్యారధం, ఇంటింటికి ప్రచార రథం ద్వారా ఈరోజు మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చుటకు ఈ రథం ద్వారా ప్రచారం చేయడమైనది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రచార రధం పర్యటించినది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు పెనుగంచిప్రోలు నందు ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తూ ఎంఈఓ డి రవీందర్ మాట్లాడుతూ ఈ ప్రచార ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా ప్రజలకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన మరియు ప్రచారం కొరకు ఈ రథము ప్రధాన ఉద్దేశ్య ము. గౌరవ జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ ప్రచార రథం మండలంలోని అన్ని గ్రామాలలో పర్యటించి నది. ఈ కార్యక్రమంలో నందిగామ డివై.ఈవో యి. గురునాథం, ఎంపీడీవో జి. శ్రీను,ఎంఈఓ లు డి. రవీందర్, వెంకయ్య, ప్రధానోపాధ్యాయలు,కే. జలజ, .బాబురావు, మండల పరిషత్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,సీఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఎస్ఎంసి చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.