బడి పిలుస్తోంది- ప్రచార రధం కార్యక్రమమును

వత్సవాయి మండల పరిధిలో సచివాలయాల్లో పిలుపునిచ్చిన ఎంఈఓ నాగరాజు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 30 వత్సవాయి మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు సమగ్ర శిక్ష సిబ్బంది, ఎస్ జీఎస్ డబ్ల్యూ. స్టాఫ్,, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్స్, డ్వాక్రా విఓఏఎస్ మరియు నాయకులను సమన్వయము చేసుకొని బడి పిలుస్తోంది- ప్రచార రధం కార్యక్రమమును ఉదయం 8:00 గంటల నుండి మన వత్సవాయి మండలంలోని ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని ఆయా గ్రామాల సచివాలయముల పరిధిలో బడి ఈడు పిల్లలను బడిలో నమోదు చేయుట కొరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ ను ఇంటింటికి ప్రచార రధం ద్వారా చేపట్టడటం జరిగెను.,

ఈ కార్యక్రమం ముఖ్యం ఉద్దేశాలైన


1.ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరు విద్యార్థుల కు నాణ్యమైన విద్య అందించుట,
2.సుశిక్షితులైన ఉపాధ్యాయులతో బోధన,
3.సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కానుక,
4.తల్లికి వందనం,
5.ప్రభుత్వ పాఠశాలల్లోని విశాల ప్రాంగణములు, ఆహ్లాదకర వాతావరణం,
ఒక తరగతి గదిలో నాలుగేసి ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు,
5.శారీరక సౌష్టవానికి వ్యాయామోపాధ్యాయులతో క్రీడలు ఆడించుట,
కండ పుష్టికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో రోజుకొక మెనూ చొప్పున ఆహారం,
6.శుద్ధ జల ఆర్ ఓ ప్లాంట్లు,
7.ఆకర్షణీయమైన తరగతి గదులు, అధునాతన టాయిలెట్స్, 8. ఐ. యఫ్. పి ప్యానెల్స్ మరియు స్మార్ట్ టి. వి లతో విద్యా బోధన, 9.ప్రతీనెల ఉపాధ్యాయు తల్లిదండ్రుల సమావేశాల ద్వారా విద్యార్థి యొక్క నిష్పాదనలు తెలియజేయుట ఇత్యాది విషయాలతో ప్రచారాన్ని ప్రారంభించి… అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానాలను అధిరోహించిన వారి స్ఫూర్తి తో గ్రామ పెద్దల సహాయ సహకారాలతో.., నేడు ఈ కార్యక్రమం జరిపాము., నేటి ఉదయం అనగా ది.29.05.2026 ఉదయం 8 గంటల నుండి బడి పిలుస్తోంది చైతన్య ప్రచార రధమును ఉదయం 8 గంటలకు భీమవరం గ్రామములోని వీధులలో ఇంటింటికి ప్రచార రధము ద్వారా గ్రామస్తులకు తెలియజేసి, ఆ తరువాత ఉదయం 9 గంటల నుండి 10 గం ల వరకూ మక్కపేట గ్రామము నందు నిర్వహించాము.., తదుపరి 10 గంటల నుండి 11.30 ని.ల వరకూ గోపీనేనిపాలెం గ్రామంలో జరిపాము.., తరువాత 11.30 నుండి 12.00 వరకు మంగొల్లు గ్రామంలో నిర్వహించడం జరిగింది.., తరువాత 12.00 నుండి 1.00 వరకు కన్నీవీడు గ్రామంలో జరిగింది, ఆ తరువాత మధ్యాహ్నం 1.00 నుండి 2.00 వరకు పోలంపల్లి గ్రామంలో నిర్వహించడం చేశాము..,పిమ్మట 2.00 నుండి 3.00 వరకు వత్సవాయి గ్రామంలో ఆ తరువాత 3.00 నుండి 4.00 వరకు కంభంపాడు గ్రామంలో ఈ ప్రచార రధం ద్వారా పిల్లలను బడిలో చేర్చు కార్యక్రమమును నిర్వహించడం జరిగెను, అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో ఆయా పాఠశాల సిబ్బంది నిర్వహించారు, ఈ కార్యక్రమం మండల విద్యాశాఖాధికారి యల్. నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది.. యం. ఈ. ఓ నాగరాజు మాట్లాడుతూ.., గౌరవ విద్యా శాఖ మంత్రి . నారా. లోకేష్ ప్రభుత్వ పాఠశాలలకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు., అలాగే పాఠశాలలు విద్యార్థులకు కల్పిస్తున్న ప్రయోజనములను గ్రామ గ్రామానా వివరించారు., (ఎంపీడీవో)మండల అభివృద్ధి అధికారి యన్. రాంబాబు మక్కపేట, గోపీనేనిపాలెంలలో నిర్వహించిన ప్రచార ఈ.కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులను ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను నమోదు చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు., ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది,ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డ్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్స్, వెలుగు సిబ్బంది, ఆయా గ్రామాల్లో ఉన్న గ్రామ పెద్దలు, ప్రముఖులు, విద్యావేత్తలు, నాయకులు పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేశారు.