పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5 సాలూర : బోధన్ రూరల్ ఎస్సైగా ఉత్తమ సేవలు అందించి బదిలీపై వెళుతున్న ఎస్సై మచ్చెందర్ రెడ్డిని గురువారం సాలూర మండలం జాడి జమాల్ పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ బాబుతో కలసి శాలువా వేసి ఘనంగా సత్కరించారు.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించిన ఎస్సైని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.పోలీస్ శాఖలో మంచి పదోన్నతులు పొంది ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సుందర్ రాజు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు బెల్లంకొండ ఆరోగ్యరాజు,కే. బాలరాజు,సొషల్ మీడియ జిల్లా కన్వినర్ విఠల్,మజార్,కౌటిల్యలు ఉన్నారు.