పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 29. 05.2026 మదనపల్లి అన్నమయ్య జి ల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ// రాజ్యాధికారంలోకిరాని జాతి, సమూహం, సమాజం నశించిపోవడం, కనుమరుగుకావడం మరియు అంతరించిపోవడం ఖాయం. ఈ మాట నేనుచెపుతున్నదికాదు. మన పూర్వీకులు, మరియు మహనీయులు అనుభవపూర్వకంగా పేర్కొన్నమాట. అందుకే, మన మహనీయులు కలలుగన్న "ఐక్యత, ఆత్మగౌరవం, సౌ బ్రాతత్వం సమానత్వం, సమానప్రాతినిధ్యం, స్వయంపాలన మరియు రాజ్యాధికారం"సాధించడమే లక్ష్యంగా కలిసికట్టుగా, ఐక్యంగా, సమిష్టిగా మరియు సంఘటితంగా పనిచేద్దాం, ఉద్యమిద్దాం, పోరాడుదాం మరియు ప్రజాస్వామ్య యుద్ధం చేద్దాం. చిన్నచిన్న పొరపొట్లు, విభేదాలు, బేధాభిప్రాయాలు, వైరుధ్యాలు మరియు అవగాహనలోపాలు.. ఏ కారణంచేతనైనా, ఏ సందర్భంలోనైనా మనమధ్య పొడచూపిఉంటే.. కూర్చొని సామరస్యపూర్వకంగా, సుహృద్భావవాతావరణంలో, సోదరభావంతో చర్చించుకొందాం, సరిచేసుకుందాం మరియు పరిష్కరించుకుందాం. ఇప్పుడున్న ఎన్నికల నిర్వహణ వ్యవస్థ, మనువాదుల అనుకూల వ్యవస్థలో.. బహుజన సమూహాలు, సమాజాలు.. నూటికి 90 శాతంగా, 95 శాతంగా మరియు 98 శాతంగా వుంటున్న "నిజమైన మరియు స్వచ్చమైన" భారతీయులు.. వారే " బహుజన.నిమ్న మరియు శూద్ర" ప్రజానీకంతో పాటు అన్ని కులాల, మతాల, ప్రాంతాల, వర్ణాల మరియు వర్గాల అభ్యుదయ, ప్రగతిశీల, ప్రజాస్వామికవాద భావజాల జాతి ముద్దుబిడ్డలు అధికారంలోకి రావాలంటే.. అందులోని లొసుగులు, లోపాలు, అక్రమాలు సహా అనేక కుట్రలు, కుతంత్రాలు, మోసాలు మరియు ఈవీఎం అవకతవకలులాంటి వాటిని బొందబెట్టే, బద్దలుకొట్టే మహత్తరమైన, మహోన్నతమైన చారిత్రక ప్రయత్నం చేయాల్సి వుంటుంది మరియు పూనుకోవాల్సి వుంటుంది. "మూడంచెల" వ్యూహాన్ని, ఎత్తుగడలను అవలంభించాల్సి ఉంటుంది. పావులుకదపాల్సి వుంటుంది. అందుకోసం మన ప్రజలు ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ పెద్దఎత్తున, భారీఎత్తున ""బోధించాల్సి, సమీకరించాల్సి మరియు పోరాడాల్సి"" వుంటుంది. అంతేకాదు.. వారిలో నూతనోత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఆశావహ దృక్పథాన్ని, సంఘ చైతన్యాన్ని మరియు మనోవికాసాన్ని నింపాల్సి, కలిగించాల్సి మరియు పెంపొందించాల్సి వుంటుంది. ఇవన్నిచేసిన తర్వాత, పాలక సమాజంగా మారేందుకు ప్రయత్నించాల్సి వుంటుంది. ఇలా రాజ్యాధికారం లేకపోవడం వల్ల మనం ఏంకోల్పోయామో, కోల్పోతున్నామో దయచేసి అర్థం చేసుకోగలరు. రాజకీయ శక్తిగా ఎదగడానికి, రాజ్యాధికారం సాధించడానికి, పాలక సమాజంగా మారడానికి ఇదే మంచి తరుణం, అవకాశం. ఈ సదవకాశాన్ని, తరుణాన్ని మన జాతిబిడ్డలు.. ముఖ్యంగా నూటికి 90 శాతంగా వుంటున్న అణగారిన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లతో పాటు మహిళలు మరియు ఇతర బలహీన వర్గాలు ఎంతో చాకచక్యంగా, నేర్పుగా, ఓర్పుగా, లౌక్యంగా, లాగువంగా, యుక్తిగా, శక్తిగా మరియు సమయస్ఫూర్తితో నేటి మనతరంతో పాటు సమీప మరియు భవిష్యత్ తరాలు ఉపయోగయోట్టుకొని.. జీవితాలను సుఖమయం మరియు ఆనందమయం చేసుకోవాలని.. రాజ్యాధికారమే సకల ఘనత మహిమ ప్రభావములను చూపుతుందని.. విముక్తి మార్గం కూడా ఇదేనని స్పష్టంగా ప్రకటిస్తున్నాం మరియు తెలియజేస్తున్నాం. అందుకోసం.. బలమైన రాజ్యాధికార ""కాంక్ష మరియు వాంఛ"" ప్రతిఒక్కరిలో నరనరానా, దేహమంతా, శరీరమంతా, మనసంతా మరియు హృదయమంతా ఇమిడియుండాలని, కలిగియుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ.. ప్రతిఒక్కరికీ పేరుపేరున చేతులుజోడించి, శిరసువంచి మహనీయుల నామంలో ""జైభీములు మరియు బుద్ధవంధనాలు"" చెల్లిస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు మరియు బుద్ధవంధనాలతో బహుజన ఉద్యోగాల ఐక్యత బా మ్ సె ఫ్ చిత్తూరు జిల్లా