పయనించే సూర్యుడు మే 21, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) బస్ ల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో స్కూల్ బస్ డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై కాకినాడ వెహికల్ టెస్టింగ్ సెంటర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ, అగ్ని మాప క శాఖ అధికారులతో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. కాకినాడ ఆర్.టి.ఓ మురళి కృష్ణ, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు, అగ్ని మాపక శాఖ లీడింగ్ ఫైర్ మెన్ శివ రామకృష్ణ రెడ్డి, సత్యనారాయణ, పింగళి రావు డ్రైవర్లకు అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించారు. డ్రైవర్లకు ఈ అవగాహన తరగతులు నిర్వహించినందుకు ఆర్.టి.ఓ మురళీకృష్ణ వెహికల్ టెస్టింగ్ సెంటర్ నిర్వాహకులు యశ్వంత్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఆర్.టి.ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ డ్రైవర్లు విధులకు హాజరై ఒక గంట ముందు బస్ ను క్షీణంగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. బస్ లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించే సమయంలో డ్రైవర్లు తక్షణం స్పందించి ప్రమాద నివారణకు తగిన చర్యలు చేపట్టాలని తద్వారా ప్రాణ నష్టం తగ్గించే అవకాశం ఉంటుందని సూచించారు. ప్రమాదాలు నివారణకు డ్రైవర్లు పూర్తి సామర్థ్యంతో వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థల బస్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.