​బహిరంగ చర్చకు పలాస ఎమ్మెల్యే సిద్ధమా?!

★ న్యాయవాది దువ్వాడ శ్రీధర్ సూటి ప్రశ్న

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 పలాస. నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్ . పలాస నియోజకవర్గ ప్రజా సమస్యలపై స్థానిక శాసనసభ్యురాలకు దువ్వాడ శ్రీధర్ బాబా నేరుగా విసురుతున్న బహిరంగ సవాల్! సమాధానం చెప్పాల్సిన బాధ్యత పలాస ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన పలాస ఎమ్మెల్యే కు మాత్రమే ఉందని అన్నారు. పలాస ప్రజల ఓట్లతో గెలిచి.. నేడు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతున్న పలాస ఎమ్మెల్యేగా .మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నేను అడుగుతున్న ఈ ప్రజా సమస్యలపై 'బహిరంగ చర్చ'కు రాగలరా?" చర్చకు సిద్ధమా? అని దువ్వాడ శ్రీధర్ బాబా సవాల్ విసిరారు.

1,​పలాస జిల్లా మోసం:

పలాస జిల్లా ప్రకటించి, చివరి నిమిషంలో ఎందుకు తప్పించారో ప్రజల ముందు తేల్చడానికి సిద్ధమా?

2,​లిక్కర్ దోపిడీ:

పలాస నియోజకవర్గం వైన్ షాపుల్లో రూ. 10, గ్రామాలలో బెల్ట్ షాపుల్లో రూ. 50 అదనపు దోపిడీపై సమాధానం చెప్పడానికి సిద్ధమా?

3,​మువ్వల నగేశ్ కుటుంబానికి అన్యాయం:

మరణించిన మత్స్యకార బిడ్డ మువ్వల నగేశ్ కుటుంబానికి 100 రోజుల్లో న్యాయం చేస్తామన్న 'యువగళం' సభ హామీ పై మాట్లాడటానికి సిద్ధమా?

4,​జీడిపప్పు పరిశ్రమపై వేధింపులు:

"పలాస అంటే జీడిపప్పు… జీడిపప్పు అంటే పలాస"అలాంటిది జూలై 1 నుంచి అమల్లోకి రానున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త సర్క్యులర్ ప్రకారం: రైతు దగ్గర వ్యాపారస్తుడు జీడిపిక్కలు కొని బండి ఎక్కించే ముందే ఒకసారి ఈ-ట్రాన్స్పోర్ట్ పర్మిట్ తీసుకోవాలి. మళ్ళీ అదే జీడిపిక్కలు పరిశ్రమలో జీడిపప్పుగా తయారుచేసి ఎగుమతి చేసేటప్పుడు రెండోసారి లింక్డ్ ఈ-ట్రాన్స్పోర్ట్ పర్మిట్ చూపించాలి. ఒకే వస్తువుపై, ఒకే నియోజకవర్గంలో రెండుసార్లు పర్మిట్లు అడగడం వ్యాపారస్తులను, పరిశ్రమను వేధించడం కాదా? దీనిపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు? చర్చకు సిద్ధమా?

5,​పన్నుల భారం:

మున్సిపాలిటీలో ప్రతి ఏటా 15 శాతం ఆటోమేటిక్ ఇంటి పన్ను పెంపు దారుణాన్ని సమర్థించుకోగలరా? చర్చకు సిద్ధమా?

6,​కేవీటీ కులస్థుల హక్కులు:

వందలాది మంది విద్యార్థుల ఓబీసీ (OBC) సర్టిఫికెట్ల అన్యాయంపై వివరణ ఇవ్వడానికి సిద్ధమా?

7,భూముల రక్షణ:

పలాస నియోజకవర్గంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములు, చెరువులు, కొండలు, దేవాదాయ భూములను కంచె వేసి రక్షించే స్ఫూర్తి మీకు ఉందా? దీనిపై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా ?
​ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన కనీస బాధ్యత ప్రజాప్రతినిధిగా మీపై ఉంది. పలాస ప్రజల సాక్షిగా బహిరంగ చర్చకు వస్తారా?సమయం, వేదిక మీరే ఖరారు చేయండి.. చర్చకు నేను సిద్ధమని న్యాయవాది దువ్వాడ శ్రీధర్ బాబా అన్నారు