పయనించే సూర్యుడు జూన్ 15 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి ఆయకట్టు పరిధిలో గల బాపన కుంట చెరువు తలుపుల మరమ్మత్తు గత పది సంవత్సరాలు ఎన్ని పర్యాయాలు ప్రయత్నించిన చేయలేని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదేశాల మేరకు ఏకంగా కొత్త తలుపులు మరియు సామాగ్రి బిగించడం జరిగింది కాలువలో పేర్కొన్న నాచు పూడిక కూడా తొలగించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుచున్నవి. ఇట్టి పనులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు గారు మరియు శశిధర్ రెడ్డి సుమిత్ రెడ్డి సిపిఐ మండల నాయకులు తుం బుచ్చిరెడ్డి ఎండి మైనుద్దీన్ గారు పర్యవేక్షించడం జరిగింది.