బిజినపల్లిలో వార్డు సభ్యులకు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నేడు

పయనించే సూర్యుడు జూన్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి, మండలంలోని గ్రామపంచాయతీ వార్డు సభ్యుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మంగళవారం ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కథలప్ప తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం బిజినపల్లిలోని రైతు వేదికతో పాటు మండల పరిషత్ కార్యాలయం (ఎంపీడీఓ ఆఫీస్)లో నిర్వహించబడనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే ఈ శిక్షణలో గ్రామపంచాయతీల నిర్వహణ, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామపంచాయతీల వార్డు సభ్యులు తప్పనిసరిగా హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ కోరారు. ఈ శిక్షణ ద్వారా స్థానిక పాలన వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.