పయనించే సూర్యుడు మే 20 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)గా బాధ్యతలు స్వీకరించిన శంషోద్దీన్ను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన నాయకులు ఎస్ఐకి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి నూతన ఎస్ఐ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీసు సేవలు కొనసాగించాలని కోరారు. పోలీసు శాఖకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ జిల్లా మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు ఎండీ. ముక్తార్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండీ. నజీర్, మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎండీ. అజీమ్, ఖిజర్, సాదత్, మన్సూర్తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.