బిజినపల్లి నూతన ఎస్సై శంషదీన్‌కు బీసీ సంఘం నాయకుల శుభాకాంక్షలు

శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ

పయనించే సూర్యుడు జూన్ 1 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) శంషదీన్‌ను ఆదివారం మండల బీసీ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు, పోలీసు శాఖకు మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా బీసీ సంఘం తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, నూతన ఎస్సై విజయవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సంఘం అధ్యక్షుడు వేముల సత్యశీలసాగర్, కమిటీ చైర్మన్ అంతటి రాజేందర్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు దాసర్ల వెంకటస్వామి తదితర బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.