బిజెపి నాయకులు మధుసూదన శర్మకు బీజేపీ పార్టీలో కొత్త భాధ్యతలు

పయనించే సూర్యుడు జూలై 07 ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కొన్ని జిల్లాలలో సీనియర్ నాయకులకు మరియు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే భారతీయ జనతా పార్టీ నాయకులకు కొత్త బాధ్యతలను అప్పగించి రాష్ట్రములో పార్టీ బలోపేతానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తనదైన శైలిలో వెళుతున్నారు.ఈ కార్యక్రమములో భాగము కర్నూలు జిల్లాలో అన్ని మండలాలకు జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ నూతనముగా అన్ని మండలాలకు ఇంచార్జీలను నియమించడం జరిగింది.అందులో భాగముగానే ఆదోని పట్టణములోని బిజెపి నాయకులు వెల్లాల మధుసూధనశర్మను,సాదాపురం మండలానికి ఇంచార్జీగా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా మధుసూదన శర్మ మాట్లాడుతూ నా మీద నమ్మకముంచి సాదాపురం మండలానికి ఇంచార్జీగా నియమించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కి కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణకి మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి నాపై నమ్మకం ఉంచి బిజెపి పార్టీలో చేరిన రోజునుండి కూడా మా అమరావతి నగర్ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించడం మొదలుకుని జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలను ఎప్పటికప్పుడు నాకు తెలియచెబుతు ఆదోని బిజెపి పార్టీలో మరీ ముఖ్యంగా సాదాపురం మండలానికి ఇంచార్జీగా నియమించడములో ప్రత్యేక చొరవ చూపించిన మా నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని మధుసూదన శర్మ తెలిపారు.అలాగే యువకుడు ఉత్సాహవంతుడు అయిన సాదాపురం మండల అధ్యక్షులు బి.ఉషారాజు తో కలిసి పార్టీ కార్యక్రమాలను మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలను పేదలకు చేరవేయడానికి ఉషారాజు తో కలిసి పనిచేస్తానని మధుసూదన శర్మ తెలిపారు.

.