పయనించే సూర్యుడు07-07-2026-రాజంపేట న్యూస్ : బిజెపి ఎస్ఐఆర్ కార్యాలయాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, మాజీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ తెలియజేశారు. సోమవారం తిరుపతి జాతీయ రహదారిలోని హర్ష టయోటా షోరూం పక్కన ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో బీజేపీ కార్యకర్తలు మరియు బిఎల్ఎ-2 లు పూజా కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్, హిమగిరి యాదవ్, ఆదినారాయణ, సునీత రాజంపేట అసెంబ్లీ బి ఎల్ ఏ -1 సమ్మెట నరేంద్ర రాజు, రాయలసీమ ఎస్సీ మోర్చా జోనల్ ఇంచార్జి రమణయ్య, పట్టణ అధ్యక్షులు వి. వి రమణ, గిరీష్, బాలాజీ, ఒంటిమిట్ట మండల అధ్యక్షులు భాను ప్రకాష్ రాజు, మాజీ సర్పంచ్ లక్ష్మికర్ రెడ్డీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.