పయనించే సూర్యుడు, కోరుట్ల జూన్ 7. ఇందూరు పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ఆదేశానుసారం జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనూప్ రావు రాష్ట్ర నాయకులు రుద్ర శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మినారాయణ తో కలిసి సీనియర్ నాయకులు సుధవేణి మహేష్ గౌడ్ కి జిల్లా కార్యదర్శి గా నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుధవేణి మహేష్ ని జిల్లాలో బీజేపీ పార్టీ ని మరింత పటిష్టంగా ముందుకు తెసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా సుధవేణి మహేష్ మాట్లాడుతూ జిల్లా కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించిన ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్న కి సహకరించిన జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబుకి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనూప్ రావు కి రాష్ట్ర ఓబీసీ నాయకులు రుద్ర శ్రీనివాస్ కి, పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మినారాయణ కి వెన్నంటే ఉన్న పట్టణ బీజేపీ,బీజేవైయమ్ నాయకులకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు చెట్లపల్లి సాగర్ ఎర్ర రాజేందర్ మ్యాకల గణేష్ గిన్నెల శ్రీకాంత్ రాగంశెట్టి సాయి అందుర్తి రమేష్ నారవేణి విజయ్ బల్క ప్రేమ్ సాగర్ మండల నాయకులు అంబల్ల సుదర్శన్ సంకు నరేందర్ బొలిశెట్టి రాజేందర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.