02 Nov 2026 | 09:18 PM

బీజేపీ మహిళ మోర్చ మండల నూతన కమిటీ ఎన్నిక ఉపాధ్యక్షురాలు గూడెల్లి స్వప్న ప్రధాన కార్యదర్శిరాలు ఎండ్ర ప్రమోద పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి

పయనించే సూర్యుడు :నవంబర్ /03:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని మండల బీజేపీ మహిళ మోర్చ అధ్యక్షురాలు మారవేణి దివ్య ఆధ్వర్యంలో మండల కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మండల మహిళ మోర్చ కమిటీ ఏర్పాటు చేసారు. మండలం బిజెపి మహిళ మోర్చ ఉపాఅధ్యక్షురాలు గూడెల్లి స్వప్న , ప్రధానకార్యదర్శిరాలు ఎండ్ర ప్రమోద, లకు నియామక పత్రాలను సీనియర్ నాయకులు తో కలిసి అందించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్వప్న , ప్రమోద , మాట్లాడుతూ మా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ బిజెపి పార్టీ మండల కేంద్రంలో మహిళలను ఐకమత్యం చేసి పార్టీ కోసం నిరంతరం కృషి చేసి పటిష్టంగా బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు ముత్తక్క మండల, కార్యదర్శిరాలు అలువాల భారతి , రాష్ట్ర నాయకుడు మ్యాకల మల్లేశం, జిల్లా ఏసీ మోర్చ జనరల్ సెక్రటరీ మామిడి హరీష్ , మండల నాయకులు మారవేణి శ్రీశైలం, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.