బీడికార్మికుల ఇంటిస్థలాలను కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకొండికార్మికులు తాసిల్దార్ కి వినతి పత్రం

పయనించే సూర్యుడు గాంధారి జులై 5 /2026 బీడి కార్మికుల ఇంటి స్థలాలను కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ రేణుక చౌహన్, గాంధారికి చెందిన నిరుపేద కార్మికులు బాధితులు శనివారం వినతి ప్రతం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయని తహసీల్దారు తెలియజేశారు. జువ్వాడి గ్రామ శివారులోని 2010లో ఉత్తునూర్ చెందిన సంజీవరావు తన 6 ఎకరాల వ్యవసాయ భూమి సర్వే నంబర్110, 109లో వెంచర్ షాట్లుగా మార్చి విక్రయించారు. గాంధారి మండల సుమారు 300 మంది బీడికార్మికులు వెంచర్లో ఇంటిస్థలాలను కొనుగోలు చేశారు. ఇటివలే గుర్తుతెలియని తమ భూములను కబ్జా చేసి ట్రాక్టర్ తో దుక్కి దున్ని పంట చేశారని పేర్కొన్నారు. తమ ఇంటి స్థలాన్ని కబ్జాలకు గురికాకుండా చూడాలని, తక్షణమే కబ్జాదారులపై తగు చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ ను కోరారు. అనంతరం జువ్వాడి చెందిన సర్పంచ్ శాంతవ్వ, కార్యదర్శి చంద్రకాంత్, ఉపసర్పంచ్ సంతోష్, వార్డ్ మెంబర్ సాయి మల్లు, వినతి పత్రం ఇచ్చారు. బాధితులు లక్ష్మణ్, శ్రీనివాస్, శివ, శ్రీను, శంకర్, సాయిలు, సంతోష్, సంజీవ్, సాయి, శంకర్, కొండ సాయిరాం చే0ధూరి సాయిలు అంబదాస్, తదితరులు పాల్గొన్నారు.